![]() |
![]() |
.webp)
సోషల్ మీడియాలో ఇటు బుల్లి తెర మీద విష్ణు ప్రియా ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. తన ఇన్స్టాగ్రామ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకోమంటూ హడావిడి పిక్స్ పెట్టి వార్తల్లో నిలిచింది. ఏదైనా సరే వెరైటీ సృష్టిస్తూ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా స్టార్స్ అంతా కూడా ఆమె బాటలో సబ్స్క్రయిబ్ బటన్ ని పెట్టుకుంటుంటున్నారు. అలాంటి విష్ణు ప్రియకి హీరో అఖిల్ అంటే పిచ్చి. ఆ పిచ్చి ఎలాంటిదో రీసెంట్ గా ప్రసారమైన సర్కార్ ఎపిసోడ్ లో చెప్పుకొచ్చింది.
"నీ ఫేవరేట్ హీరో ఎవరు" అని సుడిగాలి సుధీర్ విష్ణుప్రియని అడిగాడు. "నా ఫేవరేట్ కం క్రష్ సుడిగాలి సుధీర్ అని చెప్పింది. "ఆమె ఫేవరేట్ హీరో అఖిల్ గారు. ఆమె చేతి మీద టాటూ కూడా ఉంటుంది అని సుధీర్ చూపించాడు. "సో అఖిల్ గారు కలిస్తే ఎం మాట్లాడతావ్ " అని అడిగాడు సుధీర్. "అట్లీస్ట్ నాకు ఒక రోజు కావాలి.
ఆయన మీద ఉన్న ప్రేమ ఆయన గురించి ఊహించుకున్న ఊహలన్నీ షేర్ చేసుకోవడానికి. " అని చెప్పింది విష్ణుప్రియా. అఖిల్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటానంటూ కూడా గతంలో ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు కూడా ఒక రోజు కావాలంటూ కామెంట్స్ చేసింది. ఇలా టాటూస్ ని చాలామంది వేయించుకున్నారు. శ్రీముఖి బిగ్ బాస్ టాటూని హౌస్ లో వేయించుకుంది. అష్షు రెడ్డి పవన్ కళ్యాణ్ పిక్ ని తన నడుము మీద వేయించుకుంది.
![]() |
![]() |